పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన ప్రాణ నష్టం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.