HYD: బన్సీలాల్‌పేటకు చెందిన వై.సౌమిక వరుసగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించారు. గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్‌గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. సౌమిక ప్రతిభను మాజీ మంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం అభినందించారు. “ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గర్వకారణం” అని తలసాని పేర్కొన్నారు. MA పూర్తి చేసిన సౌమిక ప్రస్తుతం PHD చేస్తోంది.