KDP: జిల్లాలో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాలతో, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రమణయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజలు, పోలీసులు ప్రతి ఆదివారం సైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కాగా, వ్యాయామాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని, ఇది ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.