HYD: విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ కస్టడీకి తీసుకుంది. ఏడీఈ అంబేద్కర్ను నాలుగు రోజులపాటు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు కస్టడీలో ఏసీబీ విచారించనుంది. గత నెల 16న అంబేద్కర్ నివాసంలో సోదాలు చేయగా.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏడీఈ అంబేద్కర్ అరెస్టు అయిన విషయం తెలిసిందే.