ADB: ఖానాపూర్ నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యే దివంగత అంబాజీ జాదవ్ మహోన్నతమైన వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్ సుగుణక్క భుజంగరావు దంపతులు అన్నారు. ఆదివారం ఉట్నూర్ మండలం చీమ నాయక్ తండాలో నిర్వహించిన అంబాజీ జాదవ్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.