KRNL: పెద్దకడబూరు మం. చిన్నతుంబళం గ్రామ శివారుల్లో ఉన్న రాయల చెరువును ఇవాల MLA బాలనాగిరెడ్డి పరిశీలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాయల చెరువు నిండిపోయి కడగమ్ము ఎక్కి ప్రవహించడాన్ని పరిశీలించారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్న పిల్లలను చెరువు వైపు పంపవద్దని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.