NLG: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే ఎగ్ బిర్యానీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. భోజనాన్ని మరింత రుచికరంగా మార్చేందుకు, వీక్లీ రెండు సార్లు ఎగ్ బిర్యానీ ఇస్తామని మొదట్లో అట్టహాసంగా ప్రకటించారు. ఈపథకం ప్రారంభమైన కొద్ది రోజులకే ఆటకెక్కింది. మసాలా దినుసుల కోసం ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిచిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.