MBNR: దసరా పండుగ సెలవులు ముగియడంతో జిల్లా నుంచి హైదరాబాద్ పట్టణ దిశగా ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. జిల్లా పరిధిలోని బాలానగర్ టౌన్లో NH-44పై జరుగుతున్న ఫ్లైఓవర్ పనుల కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎస్పీ డి.జానకి స్వయంగా ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించారు. రద్దీ సమయాల్లో వాహనాల కదలిక సజావుగా జరిగేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.