ADB: భీంపూర్ మండలంలోని కోజన్ గూడ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం గుంతలమయంగా మారటంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న రోడ్డు మార్గం పనులను గ్రామ పెద్దలు ఆదివారం పరిశీలించారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ పెద్దలు జైవంత్ రావ్, సంజీవ్, శ్రీకాంత్, తులసి రామ్, లక్ష్మణ్ తదితరులున్నారు.