WGL: నర్సంపేట నియోజకవర్గ MLA దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ఆదివారం MLA నివాసానికి వెళ్లి, కాంతమ్మ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాధవరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉన్నారు.