NLR: నగరంలోని వేణుగోపాల్ నగర్లో ఉన్న ఫిష్ మార్కెట్ మత్స్య భవన్‌ను ఇవాళ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. ప్రజల కనీస అవసరాలను తీర్చటం తమ ప్రభుత్వ బాధ్యతని రాష్ట్ర మంత్రి నారాయణ తెలియజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పక నెరవేరుస్తామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ తెలిపారు.