MDK: జిల్లాలో మద్యం దుకాణాలకు ఆరు దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పోతంశెట్టిపల్లి (దుకాణం15)-3 దరఖాస్తులు, పాపన్నపేట (10), మాసాయిపేట (42), నార్సింగి (43) ఒక్కొక్క దరఖాస్తుగా ఆరు దరఖాస్తులు విచ్చేసినట్లు వివరించారు. పని దినాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈనెల 18 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.