KMM: బోనకల్ మండలంలోని గోవిందాపురం గ్రామంలో జరిగిన మాదినేని రాధాకృష్ణ దశదినకర్మ కార్యక్రమంలో CPM కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టులకు భవిష్యత్తు లేదని కొంతమంది అంటున్నారు. కమ్యూనిస్టులు లేకుంటే దేశ భవిష్యత్తే ప్రమాదకరమవుతుందన్నారు. డబ్బు, పదవుల కోసం కాదు సమానత్వం, ప్రజల కోసం కమ్యూనిస్టులు జీవిస్తారని ఆయన అన్నారు.