అనంతపురం శిశుసంరక్షణ కేంద్రంలో పసికందు మృతిచెందిన ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. మంత్రి సంధ్యారాణితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు ఆయాల మధ్య వివాదంతో బిడ్డకు పాలు పట్టకపోవడమే మృతికి కారణమనే ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.