గుంటూరులోని ఏసీ కళాశాల అసెంబ్లీ మందిరంలో మానవత ఆధ్వర్యంలో ఇవాళ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ హనుమంతు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు లోకహితమైన, క్రమశిక్షణతో కూడిన విద్యను అధ్యయనం చేసి సమాజాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.