GNTR: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ నిరులా విద్యాలయంలో ఇవాళ జరుగుతున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (APP) పరీక్షల వద్ద బందోబస్త్ ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల సీటింగ్ ఏర్పాట్లను, పరీక్షల సరళిని పరిశీలించి, ఇన్విజిలేటర్లతో మాట్లాడారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సూచించారు.