విజయనగరం ఉత్సవాలు 2025 లో భాగంగా లైన్స్ కమ్యూనిటీ హాల్ నందు జానపద కళలు, విజయనగర వైభవంపై లఘు చిత్ర ప్రదర్శన గావించారు. ఆంధ్ర జాలరి, కోలాటం, చెక్కభజన, కర్రసాము, కత్తి సాము, పులి వేషాలు, దింసా వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అధికారి పీఎన్వీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.