GNTR: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 28వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇశాళ తుళ్లూరులోని ప్రజా సంఘాల కార్యాలయం వద్ద KVPS పతాకాన్ని సంఘం జిల్లా నాయకుడు కోటేశ్వరరావు ఆవిష్కరించారు. 78 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఇప్పటికీ సమాజంలో దళితులు, దళిత మహిళల మీద దాడులు, అత్యాచారాలు జరగడం సిగ్గుచేటని KVPS జిల్లా కార్యదర్శి నవీన్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.