BDK: దమ్మపేట మండలం గండుగలపల్లిలో ఆదివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారితకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని వారికి 50% ప్రాతినిత్యం కల్పిస్తామని ప్రకటించారు. ప్రజాదరణ, సమర్థవంతమైన పాలన వంటి లక్షణాలు కలిగి ఉండాలని, మహిళా కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.