TG: రాష్ట్ర డీజీపీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డి ఈరోజు యాదగిరిగుట్టలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న డీజీపీకి అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయనకు వేదపండితులు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు.