సత్యసాయి: మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రోగులకు అందుతున్న వైద్యసేవలు, ఔషధాల లభ్యత, ఆసుపత్రి శుభ్రత వంటి అంశాలను చర్చించారు. ప్రజలకు ఎల్లప్పుడూ వైద్యసేవలు అందేలా చూడాలని, ఆరోగ్య పరిరక్షణ పట్ల వైద్యులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.