SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి గుడిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీ. గీతే ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం తర్వాత అర్చకులు వారిని అద్దాల మండపంలో ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. అధిక సంఖ్యలో ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు రావడంతో ఆలయం సందడిగా మారి దర్శనమిస్తుంది.