GNTR: రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. వర్షం తగ్గే వరకు పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, వార్డ్ సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.