KMM: అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక తరలిస్తున్న రెండు లారీలను సీజ్ చేసినట్లు కల్లూరు ఎస్సై డీ.హరిత తెలిపారు. లారీ డ్రైవర్లను విచారించగా.. ఆంధ్రలో టన్ను ఇసుక ధర రూ.600 ఉండగా, తెలంగాణలో రూ.1500 నుంచి రూ.2000 వరకు ఉందని, అందుకే అక్రమంగా తరలిస్తున్నట్లు వారు ఒప్పుకున్నారని ఎస్సై తెలిపారు.