KRNL: ప్రపంచంలో యుద్ధాలతో సాధించలేనిది, జ్ఞానంతోనే సాధించిన మహానీయుడు డాక్టర్ BR అంబేద్కర్ అని మంత్రాలయం MLA వై. బాలనాగిరెడ్డి అన్నారు. ఇవాళ పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏ వర్గమైనా అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.