ప్రకాశం: మీ ఆధార్‌కు బయోమెట్రిక్ లాక్ ఉందా.. లేకుంటే సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు ప్రకాశం పోలీసులు. ఇందులో భాగంగా SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ విభాగం పోలీసులు విస్తృతంగా సైబర్ నేరాలపై సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అయితే తాజాగా ఆధార్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆధార్‌కు బయోమెట్రిక్ లాక్ ఏర్పాటు చేసుకోవాలని, సూచించారు.