అన్నమయ్య: మొలకలచెరువు కల్తీ మద్యం తయారీలో అక్కడి ఇంఛార్జ్ ప్రమేయం లేదని టీడపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్ జె వెంకటేష్ తెలిపారు. ఇవాళ మదనపల్లె నందు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ…ఇప్పటికే ఈ కేసులో కొంతమంది నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. అనంతరం వైసీపీ నుండి టీడీపీలో చేరిన వారే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.