AP: విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో PHC వైద్యులతో ఆరోగ్య కమిషనర్ వీరపాండ్యన్ మరోసారి చర్చలు జరిపారు. 20 శాతం పీజీ ఇన్సర్వీస్ కోటా రిజర్వేషన్ల అమలు వ్యవధిపై చర్చించారు. PG ఇన్ సర్వీస్ కోటాను మరో మూడేళ్లు ఇవ్వాలని PHC వైద్యులు డిమాండ్ చేశారు. ఈ ఏడాది వరకు PG ఇన్ సర్వీస్ కోటా 20 శాతం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.