ఆసిఫాబాద్ పట్టణంలో ఆదివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో హిందూ సంఘాలు, రాజకీయ నేతలతో కలిసి ఎమ్మెల్యే కోవలక్ష్మి పాల్గొన్నారు. శారదా దేవి, దుర్గ దేవి నిమజ్జనం రోజున జరిగిన దురదృష్టకర సంఘటనల గురించి, అలాగే భక్తులపై పోలీసులు నమోదు చేసిన కేసుల విషయంపై చర్చించారు. పండగ ఉత్సాహంలో తెలియక జరిగిన ఘటనలపై భక్తులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని MLA కోరారు.