TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. రేపు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా స్పెషల్ ఫోకస్ పెట్టాలని భట్టికి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ బయల్దేరనున్నారు.