రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప అన్నారు. ఆదివారం దహేగాం మండలానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని అన్నారు.