SRPT: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం (అక్టోబర్ 5) సందర్భంగా, కోదాడ పట్టణానికి చెందిన విద్యా సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సైదులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి ప్రభుత్వ విధానాలు ఉపాధ్యాయులకు అనుకూలంగా లేవని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల ప్రాధాన్యతను గుర్తించి, వారి స్టేటస్ మెరుగుపరచుకోవడానికి తగిన ప్రోత్సాహకాలు అందించాలన్నారు.