TG: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. దసరా సెలవులు ముగియడంతో పల్లెవాసులు నగరబాట పట్టారు. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు ఒకదాని వెంట మరొకటి బారులు తీరాయి. దీంతో చిట్యాల, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. మరోవైపు ప్రయాణికులతో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు కిక్కిరిసిపోయాయి.