HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్ధమైన BJP అభ్యర్థి వేటలో పడింది. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర నాయకత్వం నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 1.83 లక్షల ఓట్లు పోల్ కాగా.. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 25,866 ఓట్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు.