HYD: లక్డీకాపూల్లోని అశోక హోటల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమైన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఎంపీ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, అలాగే చట్ట సభలలో 50% రిజర్వేషన్లు సాధించాలన్న లక్ష్యంతో చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు