KMM: ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధిర నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలు నిర్లక్ష్యం వల్లే ఓటమి చవిచూశామని చెప్పారు. హామీలపై కాంగ్రెస్ నాయకులను నిలదీస్తామన్నారు.