AP: శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిపై దేవదాయ, అటవీశాఖతో CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి DyCM పవన్ కళ్యాణ్, మంత్రి ఆనం హాజరయ్యారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం గల దివ్యక్షేత్రం సమగ్రాభివృద్ధిపై చర్చించారు. ఏటా లక్షలాది భక్తుల రాక దృష్ట్యా మెరుగైన సౌకర్యాలు, ప్రణాళికలపై చర్చ జరిగింది. తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు.