ప్రకాశం: విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ను కనిగిరి మండలం టీడీపీ యువ నాయకులు సుతారి కోటి ఆదివారం మధ్యాహ్నం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. సుతారి కోటి తన పిల్లల పుట్టినరోజు సందర్భంగా మంత్రిని కలిసినట్లు తెలిపారు. కాగా మంత్రి నారా లోకేష్ వారి పిల్లలకు స్వీట్లు ఇచ్చి, ఆప్యాయంగా పలకరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.