GDWL: అలంపూర్ మండలంలో 14 గ్రామాల్లో 120 వార్డులు ఉండగా.. 17,000 మంది పైగా ఓటర్లు ఉన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల హడావిడి మొదలైంది. దీంతో స్థానిక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతోపాటు వివిధ పార్టీలకు చెందిన గ్రామ నాయకులు తమ వైపే అధిష్ఠానం మొగ్గు చూపేలా ప్రణాళికలు రచిస్తున్నారు.