NLG: స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి సందర్భంగా ఆదివారం మిర్యాలగూడలోని వారి విగ్రహానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనేక కార్మిక ఉద్యమాలలో ఆయన ప్రత్యక్షంగా పోరాటం చేశారని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపిన వ్యక్తి ‘కాకా’ అని అన్నారు. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు.