NDL: బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామ సమీపంలో ఉన్న పెద్దమ్మ గుడి వద్ద ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ను ఢీ కొట్టింది. ఇవాళ జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.