WG: ఈ నెల 11న విజయవాడలో జరిగే విజ్ఞానపన సభను జయప్రదం చేయాలని ఎంటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లంగి కేశవ కుమార్, రాష్ట్ర కో ఆర్డినేటర్లు రాజా లింగం, అనిల్ అరవింద్ కుమార్ అన్నారు. ఆదివారం భీమవరం లూథరన్ హైస్కూల్లో జరిగిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. 1998 ఎంటీఎస్ గత 25 ఏళ్లుగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని, టెంపరరీ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలన్నారు.