కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థల నెట్‌వర్క్‌కు వచ్చే నిధులపై ఆ దేశ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. విరాళాలను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని హమాస్‌తో పోల్చిన మోర్సో నివేదిక, నాన్‌ప్రాఫిట్ సంస్థల్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయని అనుమానించడంతో ప్రభుత్వం దృష్టి సారించింది.