HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 125వ డివిజన్ గాజులరామారం భవాని నగర్లో రూ.41 లక్షల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్డు పనులను మాజీ MLA, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా కూన మాట్లాడుతూ.. CM రేవంత్ రెడ్డి బస్తీ నుంచి పట్టణాల వరకు సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఉన్నారన్నారు.