మేడ్చల్: 74 ఏళ్ల వయసులో 130వ బోస్టన్ మారథాన్‌కు అర్హత సాధించిన మల్లాపూర్ రన్నర్ చాలమలశెట్టి నాగభూషణం రావును ఉప్పల్ MLA లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ దేవేందర్ అభినందించారు. ఈ సందర్భంగా MLA ఆయన్ని శాలువాతో సత్కరించారు. లక్ష్య సాధనకు వయసు అడ్డంకి కాదని నిరూపించి, యువతకు ఆదర్శంగా నిలిచాలన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు.