HNK: శాయంపేట మండల కేంద్రంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఇంటింట తిరుగుతూ ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే కాంగ్రెస్ నాయకులను గ్యారెంటీల అమలుపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.