HNK: కాంగ్రెస్ బూటకపు హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పైన ఉందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోస, బతుకమ్మ చీరలు, ప్రతి మహిళకు 2500 వంటి అమలు కానీ బూటకపు హామీలతో గద్దెనెక్కినదని మండిపడ్డారు.