WGL: నర్సంపేటలో దసరా రోజున సీఐ సమక్షంలో జరిగిన జంతుబలి ఘటన పై CP సన్ ప్రీత్ సింగ్, CI పై విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సీఐకి మద్దతుగా వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు వైరలవుతున్నాయి. సీఐపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని పోలీసు అభిమానులు, సహచరులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారుల స్పందన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.