MNCL: ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన జన్నారం మండలంలోని కామన్ పల్లి గ్రామానికి చెందిన అభిలాష్ ను నేతకాని సంఘం నాయకులు సన్మానించారు. ఆదివారం వారు గ్రామంలో అభిలాష్‌ను కలిసి సన్మానించారు. అభిలాష్ పంచాయతీరాజ్, పోలీస్ శాఖ, మున్సిపల్, గ్రూప్ 2, 3 లలో ఉద్యోగాలు సాధించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు గడ్డి జగన్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జి.గోపాల్ ఉన్నారు.