MBNR: జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ‘ఓటు చోరీ సిగ్నేచర్’ క్యాంపెయిన్ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు ప్రతి డివిజన్లో, ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో 30 సంతకాలకు తగ్గకుండా క్యాంపెయిన్ చేపట్టాలని పిలుపునిచ్చారు.